నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి రంగంలోకి దిగారు. రైల్వే అధికారుల వైఖరిని, కార్పొరేషన్ అధికారుల తీరును నిరసిస్తూ మురికి గుంటలో దిగుతున్నానని చెప్పి మరీ డ్రైనేజీలోకి దిగి కూర్చున్నారు. సమస్య పరిష్కారం కోసం లిఖిత పూర్వక హామీ ఇచ్చే వరకు అక్కడినుంచి కదిలేది లేదన్నారాయన